మౌనం వెనుక మిస్టరీ

మౌనం వెనుక మిస్టరీ

మహేష్ దత్త, సోని శ్రీ వాస్తవ జంటగా ‘శుక్ర’ ఫేమ్ సుకు పూర్వాజ్ డైరెక్ట్ చేసిన చిత్రం  ‘మాటరాని మౌనమిది’.  వాసుదేవ రావు, ప్రభాకర్ కలిసి నిర్మించారు. ఆగస్టు 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ బ్లెస్సింగ్స్‌‌‌‌తో రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్క, బావను చూడటానికి వాళ్ల ఇంటికి వెళతాడు హీరో.  కాకపోతే అక్క చనిపోవడంతో అన్నీ తానై చూసుకుంటాడు బావ.

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌‌‌‌లా ఉంటారు. అక్కడే హీరోకి మాటలు రాని క్లాసికల్ డ్యాన్సర్ పరిచయం అవుతుంది. ఆమెతో రిలేషన్ కూడా ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. అక్కడ ఏం జరుగుతుందనేది  మిస్టరీగా ఉంటుంది. దీంతో భూత వైద్యులను కూడా తీసుకొస్తారు.  ఇప్పటిదాకా  చూడని, వినని ఇన్సిడెంట్స్‌‌‌‌ని చూశానంటాడు హీరో.  ఇంతకు అతను ఏం చూశాడనే  ఇంటరెస్ట్ క్రియేట్ చేసేలా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ కట్ చేశారు.