Matti Katha Trailer :మట్టి కథ.. మన కథ.. మనం మర్చిపోతున్న కథ

Matti Katha Trailer  :మట్టి కథ.. మన కథ.. మనం మర్చిపోతున్న కథ

అందరూ ఉద్యోగం, వ్యాపారం, చదువులు అని పట్నం బాట పడుతున్నారు.. పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు ఇంటికి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో.. పల్లెటూరు కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి.. మట్టిలోని మధునానుభూతి ఎలా ఉంటుందనే కళ్లకు కట్టిన సినిమా మట్టి కథ. అజయ్ వేద్(Ajay Vedh) హీరోగా.. పవన్ కడియాల(Pawan kadiyala) దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా "మట్టి కథ(Matti katha)". మనకందరికీ తెలిసిన, మనం మరచిపోతున్న ‘మట్టి కథ’ను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు మేకర్స్. అద్భుతమైన కథ, ఆలోచింపజేసే  కథనాలతో రానున్న ఈ సినిమా ట్రైలర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందు నాకు మట్టికథ అనే టైటిల్ బాగా నచ్చింది. మనం పుట్టేది, గిట్టేది ఈ మట్టిలోనే. తెలంగాణ ప్రాంతం అన్నా.. మనుషులన్నా నాకు చాలా అభిమానం. వాళ్ళ మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంతే స్వచ్ఛంగా ఈ సినిమా ఉంటుందని, ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి కోరారు ప్రముఖ రచయిత విజేంద్రప్రసాద్.

ఇక మట్టికథ ట్రైలర్ సహజత్వానికి దగ్గరగా ఉంది. తెలంగాణ పల్లెల్లోని ఆప్యాయత, అనురాగాలు, స్వచ్ఛతను తెలియజేస్తుంది.  ఒక కుర్రాడు తన కలలను నెరవేర్చుకోవడానికి భూమిని అమ్ముదామనుకుంటాడు. అయితే భూమితో పల్లె  మనుషులకు ఉండే అనుబంధాన్ని., అక్కడ ఉండే సరదాలు, కష్టాలు, ఆత్మీయత అన్నీ ఈ ట్రైలర్ లో కనిపించాయి. ‘అన్నంపెట్టే పొలాన్ని అమ్ముకుంటే ఎట్టా బిడ్డా?, అంత పెద్ద రజాకార్ల దాడులు అప్పుడే.. మేం ఊరు ఇడ్సి పోలేదు వంటి డైలాగులు తెలంగాణ చరిత్రలోతును గుర్తుకు తెస్తాయి. పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపరెడ్డి అప్పిరెడ్డి(Annapareddy Appireddy) నిర్మించగా.. సహ నిర్మాతగా సతీశ్ మంజీర(Satheesh Manjeera) వ్యవహరించారు. ఈ సినిమాలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ(Kanukavva), ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి(Sudhakar reddy), దయానంద్ రెడ్డి(Dayanand reddy) తదితరులు నటించారు.