
విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ఇస్లామిక్ మత బోధకుడు మౌలానా ముఫ్తీ అజారీని గుజరాత్ లోని జునాగఢ్ లో గుజరాత్ ఏటీఎస్(గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్) అరెస్ట్ చేసింది. మౌలానా సల్మాన్ అజారీని అరెస్ట్ చేసిన తర్వాత ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కోర్టు అతడికి రెండు రోజులు రిమాండ్ విధించింది
అతడిని జనవరి 31 వ తేది రాత్రి బహిరంగ సభలో మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అజారీ, స్థానికి నిర్వాహకులు, మహ్మద్ యూసుఫ్ మాలిక్, అజీమ్ హబీబ్ ఒడెద్రాలపై జునాగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు అతడిపై ఐపీపీ సెక్షన్ 153బి 505(2) కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ తర్వాత ఘట్కోపర్ పీఎస్ స్టేషన్ ముందు అతడి మద్దతుదారలు భారీగా చేరుకుని ఆందోళన చేశారు.దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని.. పోలీసులకు సహకరిస్తానని అజారీ తన మద్దతు దారులకు చెప్పాడు. శాంతి భద్రతలను కాపాడేందుకు మీరంతా ఇక్కడి నుంచి వెళ్లాలని అనుచరులను కోరాడు.
ముఫ్తీ అజారీ ఎవరు.?
మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ తనను తాను ఇస్లామిక్ రీసెర్చ్ స్కాలర్‌గా ప్రకటించుకున్నాడు. జామియా రియాజుల్ జన్నా, అల్-అమాన్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ , దారుల్ అమన్ స్థాపకుడు. అతను కైరోలోని అల్ అజార్ విశ్వవిద్యాలయంలో తన విద్యను అభ్యసించాడు. పలు సామాజిక -మతపరమైన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని .. ముస్లింలలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తరచుగా ఇస్లామిక్ విద్యార్థులకు ప్రభావ వంతమైన ప్రసంగాలతో మార్గదర్శకత్వం చేస్తాడు.