మహారాష్ట్రలో కరోనా ఎక్కువగా 31 – 40 ఏళ్ల వారికే

మహారాష్ట్రలో కరోనా ఎక్కువగా 31 – 40 ఏళ్ల వారికే
  • అధ్యయనంలో వెల్లడి

ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారు ఎక్కువగా 31 – 40 ఏండ్ల మధ్య వయసు వారే అని ప్రభుత్వం రిలీజ్‌ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. వారి తర్వాత 41–50 ఏండ్ల మధ్య వయసు వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 17,573 (18.04%) మంది ఈ ఏజ్‌ గ్రూప్‌వాళ్ల ఉన్నారు. 61–70 ఏళ్ల వయసు వారు 10.29 శాతం కాగా.. 71 – 80 మధ్య వయసు వారు 4.34 శాతం మందికి కరోనా సోకింది. 10 ఏళ్ల వయసు వారు 3.31 శాతం, 11 – 20 ఏండ్ల వారు 6.43 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. తమ దగ్గర ఉన్న కరోనా డేటా ప్రకారం మహిళల కంటే పురుషులకే కేసులు ఎక్కువగా వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం 60,596 మంది మగవాళ్లు, 37,039 మంది ఆడవాళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. చనిపోయిన వారి సంఖ్య 3.68 శాతంగా ఉంది. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ తర్వాత చనిపోయిన వారి సంఖ్యలో మహారాష్ట్ర ఐదో స్థానంలో ఉంది.