- చివరి మూడు మ్యాచ్‌లకు యంగ్‌స్టర్ బీర్డ్‌మన్ ఎంపిక
సిడ్నీ: గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇండియాతో జరిగే టీ20 సిరీస్‌లో అతను బరిలోకి దిగనున్నాడు. 20 ఏండ్ల యంగ్ పేసర్ మాలీ బీర్డ్‌మన్‌ను కూడా సెలెక్టర్లు టీమ్‌లోకి తీసుకున్నారు. గతేడాది అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో ఆటగాడైన బీర్డ్‌మన్ ఇండియాతో ఫైనల్లో మూడు కీలక వికెట్లు తీశాడు.
లిస్ట్–ఎ, బిగ్ బాష్ మ్యాచ్‌ల్లో సత్తా చాటడంతో నేషనల్ టీమ్‌లో సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఈ నెల 29న కాన్‌బెరాలో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మ్యాక్స్‌వెల్, బెర్డ్‌మ్యాన్ చివరి మూడు టీ20లకు అందుబాటులో ఉంటారు. కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా.. సీన్ అబాట్ మొదటి మూడు టీ20లకు అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్రకటించారు.ఇక, శనివారం ఇండియాతో జరిగే చివరి వన్డే కోసం ఆస్ట్రేలియా జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ , స్పిన్నర్ మాట్ కునెమాన్‌ను జట్టులో చేర్చారు. కీపర్ జోష్ ఇంగ్లిస్‌ను కూడా జట్టులో చేరనున్నాడు. ఇక, షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో ఆడేందుకు మార్నస్ లబుషేన్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేశారు.
