
హరిద్వార్: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించి న ‘మే 23’వ తేదీని మోడీ దివస్‌గా గుర్తించాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కోరారు. పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డా , మోడీ ఒంటి చేత్తో బీజేపీకి విజయంసాధించి పెట్టారని గుర్తుచేశారు. మే23ని మోడీ దివస్ గా కాకుంటే ‘లోక కల్యాణ దివస్’గా నైనా గుర్తించాలన్నారు.