వాటర్ బోర్డు ఈడీగా మయాంక్​ బాధ్యతలు

వాటర్ బోర్డు ఈడీగా మయాంక్​ బాధ్యతలు

హైదరాబాద్​, వెలుగు : వాటర్ బోర్డు (ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ )గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు చేపట్టారు. నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తుండగా.. రాష్ట్ర సర్కార్  ఆయనను వాటర్ బోర్డు ఈడీగా బదిలీ చేసింది. బుధవారం ఆయన ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో బాధ్యతలు తీసుకోగా..

అంతకుముందు ఎండీ అశోక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. బోర్డు ఉన్నతాధికారులు, ఉద్యోగులు కొత్త ఈడీకి బొకేలను అందించిన స్వాగతం పలికారు. మయాంక్ మిట్టల్ -2020 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి.