సిటీలో గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నం: గద్వాల్ విజయలక్ష్మి

సిటీలో గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నం: గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని.. అందులో భాగంగా మొక్కలను పెంచుతున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం చేపట్టిన కోటి మొక్కలు నాటే ప్రోగ్రామ్​లో భాగంగా బంజారాహిల్స్​లోని గఫార్ ఖాన్ పార్కులో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఒక్కరోజే లక్షా 50 వేల మొక్కలు నాటామని తెలిపారు.  హరితహారంలో భాగంగా  జీహెచ్ఎంసీ పరిధిలో 2014 నుంచి 2022–-23 వరకు 741 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. 698.78 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. 

అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ ఇని​స్టిట్యూషన్, ఓపెన్ స్పేస్, శ్మశాన వాటికల్లో పచ్చదనం పెంచేందుకు జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుని.. ఇప్పటివరకు సుమారు 42 లక్షల మొక్కలను నాటామని ఆమె వివరించారు. వీఎస్టీ వద్ద బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి మొక్కలు నాటారు. హిమాయత్​సాగర్​లోని వాటర్ బోర్డు గార్డెన్​లో ఎండీ దానకిశోర్ మొక్కలు నాటారు.