గూగుల్ ఇండియా బాస్.. ఒకప్పటి హీరోయిన్​ 

గూగుల్ ఇండియా బాస్.. ఒకప్పటి హీరోయిన్​ 

1990ల్లో బాలీవుడ్​లో హీరోయిన్​గా పేరుతెచ్చుకున్న ‘మయూరీ కాంగో’  గుర్తుందా? ‘పాపా కెహతే హై’ లో ‘ఘర్ సే నికల్తే...’ పాట ఆమెను ఎంతో పాపులర్​ చేసింది. అయితే అప్పట్లో వరుస సినిమాలతో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఆమె మధ్యలో సినిమాలకు గుడ్​బై చెప్పింది.   సినిమా ఇండస్ట్రీ నుంచి  బిజినెస్​ వైపు వెళ్లింది. తరువాత గూగుల్​ ఇండియా ఏజెన్సీ హెడ్​ బాధ్యతలు చేపట్టి అక్కడ కూడా  సూపర్​ హిట్​గా నిలిచిన మయూరి గురించి... 

మయూరీ కాంగో కార్పొరేట్​ ఫీల్డ్​లో తనదైన  ముద్ర వేస్తోంది. గ్లోబల్​ మార్కెటింగ్​ ఏజెన్సీ కంపెనీల్లో మయూరీ కీలకంగా  పని చేసింది. అదే అనుభవంతో ఇప్పుడు గూగుల్​ ఇండియా ఏజెన్సీ హెడ్​గా పని చేస్తోంది.2009 తర్వాత ఆమె సినిమాలు చేయడం ఆపేసింది.  పెద్ద చదువులు చదివి బిజినెస్​ మేనేజ్​మెంట్​ వైపు అడుగేసింది. 

యాక్టింగ్​ నుంచి కార్పొరేట్​ వైపు.. 

సుమారు పదేళ్ల పాటు సినీ ఫీల్డ్​లో ఉన్న ఆమె.. ఒకవైపు నటిస్తూనే మరోవైపు  చదువు పూర్తి చేసింది.  యాక్టింగ్​తో ​ ఎంతోమంది ఫ్యాన్స్​ను సంపాదించిన ఆమె  చివరిసారిగా సైఫ్​ అలీఖాన్ సినిమా ‘కుర్బాన్’లో గెస్ట్​ అప్పియరెన్స్​ ఇచ్చింది.  2009లో సినీ కెరీర్​కు గుడ్​బై చెప్పింది.  2011లో  కుటుంబంతో కలిసి న్యూయార్క్‌‌కు షిఫ్ట్​ అయ్యింది.  అక్కడ  ‘సిటీ యూనివర్సిటీ ఆఫ్​ న్యూయార్క్​లో’లో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌‌లో ఎంబీఏ చేసింది.  ఆ తర్వాత కొంత కాలం ‘ప‌‌ర్ఫార్మిక్స్ ల్యాబ్​’  అనే కంపెనీకి మేనేజింగ్  డైరెక్టర్​గా పని చేసింది.  ఆ తర్వాత  2019 నుంచి గూగుల్ ఇండియాకు ఇండ‌‌స్ట్రీ హెడ్‌‌గా బాధ్యతలు చేపట్టింది ‘గూగుల్ ఇండియా  కార్పొరేట్ విభాగం ప్రస్తుతం చాలా మారుతోంది.   గూగుల్ లో భాగం కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, ఏజెన్సీ రంగంలో ఉన్న నా పదేళ్ల అనుభవం గూగుల్​ కంపెనీలో  పని చేసేందుకు పనికొస్తుంది.  ఇంతటి పెద్ద కంపెనీలలో పని చేయడం అద్భుతమైన అవకాశం అనుకుంటున్నా’ అన్నదామె.

‘నేను ఒక ప్యాషనేట్​ మార్కెటర్​ను. ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్​ను మార్కెట్​ చేయడానికి వీలుండే అవకాశాలను స్టడీ చేయడం నాకు ఇష్టం. ముఖ్యంగా డిజిటల్​ మీడియా ద్వారా ఇది సాధ్యం అవుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సవాళ్లను స్వీకరించడానికి  ఎప్పుడూ ముందుంటాను. నా క్లయింట్స్​కు, కంపెనీలకు  ఉత్తమ మార్కెటింగ్​ సొల్యూషన్స్​ ఇవ్వడమే నా లక్ష్యం​.’ - మయూరి కాంగో