మజురాటీ కారు ఎంసీ20 చెత్త: రేమాండ్ చైర్మన్

మజురాటీ కారు ఎంసీ20  చెత్త: రేమాండ్ చైర్మన్

న్యూఢిల్లీ: మజురాటీ సూపర్‌‌‌‌‌‌‌‌ కారు ఎంసీ20 చెత్తగా ఉందని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌లో మాట్లాడడం ఇదే మొదటిసారి ఏమో. ది రేమాండ్ లిమిటెడ్‌‌‌‌ చైర్మన్ గౌతమ్‌‌‌‌ సింఘానియా  మజురాటీ కార్లు బాగోలేవని,ఎవరూ కొనొద్దని ట్విట్టర్‌‌‌‌లో‌‌‌‌ విమర్శించారు.రూ.3.65 కోట్ల విలువైన ఈ కారును కొన్నానని, నచ్చకపోవడంతో తన గ్యారేజ్‌‌‌‌లో ఖాళీగా పడి ఉందని ఆయన పేర్కొన్నారు. సింఘానియా కు కార్లపై మోజు ఎక్కువ. 


సూపర్‌‌‌‌‌‌‌‌ కార్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌ను కూడా స్థాపించారు. ‘నేను నడిపిన కార్లలో ఇది వరెస్ట్ కార్‌‌‌‌‌‌‌‌. ఎవరైనా ఈ కారును నడపాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకరమైనది’ అని ఓ ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్న ఆయన సైడ్‌‌‌‌లైన్‌‌‌‌లో మజురాటీ కారు గురించి మాట్లాడారు. మజురాటీ కోసం డబ్బులు ఖర్చు చేస్తే నిమ్మకాయలొచ్చాయని వ్యంగ్యంగా అన్నారు.  నడుపుతున్నప్పుడు   కారు బాగా బౌన్స్ అవుతోందని, ఇండియన్ రోడ్లు బాగోలేకపోవడం వలనే ఇలా జరుగుతోందని కంపెనీ చెప్పిందని వివరించారు. 


ఒక ఇండిపెండెంట్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను నియమించి ఎంసీ20 కారు సేఫ్టీని చెక్ చేయాలని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో సవాలు విసిరారు.  కానీ, మజురాటీ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్టెలంటిస్‌‌‌‌ ఇందుకు అంగీకరించడం లేదని అన్నారు. ‘మజురాటీ ఎంసీ20 డేంజర్‌‌‌‌‌‌‌‌ అని బలంగా నమ్ముతున్నాను. ఈ కారు వలన ఎవరైనా చనిపోవచ్చు’ అని సింఘానియా ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఫోకస్ చేయాలని అధికారులను, కన్జూమర్ కోర్టును ఆయన కోరారు. సింఘానియా పోస్ట్‌‌‌‌కు  మజురాటీ రెస్పాండ్ అయ్యింది.


‘సింఘానియా లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి తమ టీమ్‌‌‌‌ వేగంగా స్పందించింది.  ఈ అంశాలు మజురాటీ  క్వాలిటీ స్టాండర్డ్స్‌‌‌‌లోపే ఉన్నాయి. ఏ సమస్యనైనా లేదా ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌నైనా సీరియస్‌‌‌‌గా తీసుకుంటాం. అయినా మా ప్రొడక్ట్‌‌‌‌ క్వాలిటీ, రిలయబిలిటీ బాగుంది.  అందువలన ఎంసీ20 కారు పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ కండిషన్‌‌‌‌లో ఉంది’ అని కంపెనీ పేర్కొంది.