MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా

MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా

‘ఎంబీయే చాయ్‌వాలా’ ఈపేరు సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు తెలిసే ఉంటుంది. ఎంబీయే చదువు మధ్యలో ఆపేసిన ఓ యువకుడు చాయ్ షాప్స్ పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ చాయ్‌వాలా ఒక మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నాడు. ఒక చాయ్‌వాలా బెంజ్ కారు కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అహ్మదాబాద్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ .. ఎంబీయే మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత ఐఐఎం- అహ్మదాబాద్ దగ్గర్లో 2017లో ‘ఎంబీయే చాయ్‌వాలా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించాడు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదరణ దక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో మరికొన్ని  ఏరియాల్లోనూ ఫ్రాంచైజీలు ఓపెన్ చేశాడు. ఇవి కూడా సక్సెస్ అయ్యాయి. అంతేకాదు.. అతడు ‘ఎంబీయే చాయ్‌వాలా’ పేరుతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి, కంటెంట్ క్రియేటర్‌గానూ మారాడు.

ప్రఫుల్ బిల్లోర్ అకౌంట్‌కు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చాయ్ షాపుల నుంచి, ఇటు సోషల్ మీడియా నుంచి ప్రఫుల్ బిల్లోర్ కు భారీగా ఆదాయం వస్తోంది. ఆరేళ్లలో గొప్ప స్థానానికి ఎదిగాడు. తాజాగా మెర్సిడెస్ ప్రీమియమ్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. ఈ కారు ఖరీదు దాదాపు రూ.90 లక్షలుగా ఉంది. తన కొత్త కారు కొన్న విషయాన్ని ప్రఫుల్ సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఒక చాయ్‌వాలా... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఈ స్థాయి విజయం సాధించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రపుల్ దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్ అయ్యాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు.. ఎంబీఏ చాయ్ వాల అకాడమీని ప్రారంభించి.. ఎంట్రప్రెన్యూర్ షిప్ లో స్పెషల్ కోర్సు అందిస్తూ... పెద్ద పెద్ద కాలేజీల్లో సూట్డెంట్స్ కు క్లాసులు చెబుతున్నాడు. అంతేకాదు.. మోటివేషనల్ స్పీకర్ గానూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.