మారుతి కారు ప్రియులకు గుడ్ న్యూస్..వివిధ మోడల్స్ పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ. మారుతి కాంపెనీ నాలుగు మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, స్పెషల్ డీలర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, అప్గ్రేడ్ లాయల్టీ బోనస్, స్క్రాపేజీ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. మే నెల ఆఖరు వరకు ఈ ఆఫర అందుబాటులో ఉంటుంది. ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుందాం..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ బ్రెజా, విక్టోరిస్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి మోడళ్లపై కంపెనీ భారీ రాయితీలు ఇస్తోంది. వీటిపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, స్పెషల్ డీలర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, అప్గ్రేడ్ లాయల్టీ బోనస్, స్క్రాపేజీ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.
మే నెలాఖరు వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మారుతీ సుజుకీ బ్రెజా ఎస్‌యూవీపై ఈ నెలలో రూ.55 వేలు వరకు రాయితీలు ఉన్నాయి. దీని ధర ఎక్స్షోరూమ్లో రూ.8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల మధ్య ఉంది.
