పిలవని పెళ్లికొచ్చి తిన్నడని..MBA స్టూడెంట్ ప్లేట్స్ కడిగించిన్రు

పిలవని పెళ్లికొచ్చి తిన్నడని..MBA స్టూడెంట్ ప్లేట్స్ కడిగించిన్రు

పిలవని పేరంటానికి వెళ్లి హాయిగా నచ్చింది తిని ఎంజాయ్ చేయడం..హోటల్ లో  తిని బిల్లు కట్టకుండా గిన్నెలు కడిగే.. సంఘటనలు మనం సినిమాల్లో చాలానే చూశాం. కానీ నిజ జీవితంలో పిలవని పేరంటానికి వెళ్లిన ఓ స్టూడెంట్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో  ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అసలేం జరిగిందంటే?

పిలవని పెళ్లికి వచ్చి భోజనం చేశాడని ఎంబీఏ స్టూడెంట్ తో గిన్నెలు కడిగించారు. జబల్పూరుకు చెందిన  ఓ స్టూడెంట్ భోపాల్ లో ఎంబీఏ చేస్తున్నాడు. దగ్గర్లో పెళ్లి జరుగుతుండటంతో వెళ్లి భోజనం చేశాడు. దీన్ని గమనించిన వధూవరుల బంధువులు.. స్టూడెంట్ తో బలవంతంగా గిన్నెలు కడిగించారు. ఈ సమయంలో.. ఆ యువకుడు తాను పిలవకుండానే పెళ్లికి వెళ్లి భోజనం చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తాను జబల్పూర్ నివాసి అని ..భోపాల్ లో ఒక కాలేజీలో ఎంబీఏ చేస్తున్నానని చెప్పాడు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మనుషుల్లో మానవత్వం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.