ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల కేటాయింపు

ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల కేటాయింపు
  • 39 కాలేజీల్లో 2,922 సీట్లు అలాట్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్‌‌మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల స్పెషల్ స్ట్రే వేకెన్సీ విడత(మిగిలిపోయిన చివరి దశ ఖాళీలు) అలాట్‌‌మెంట్ లిస్టును కాళోజీ హెల్త్ వర్సిటీ రిలీజ్​చేసింది. ఈ కౌన్సెలింగ్‌‌ లో మొత్తం 39 కాలేజీల పరిధిలోని 2,922 సీట్లను భర్తీ చేయగా.. వాటిలో 28 మెడికల్ కాలేజీల్లో 2,429 ఎంబీబీఎస్ సీట్లు, 11 డెంటల్ కాలేజీల్లో 493 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 

అలాట్‌‌మెంట్ పొందిన విద్యార్థులందరూ ఈ నెల 16న రాత్రి 8 గంటల్లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత వచ్చే రిపోర్టింగ్‌‌లను అనుమతించబోమని, గడువులోగా చేరని వారి సీటు రద్దవుతుందని స్పష్టం చేసింది.