MBBS క్లాసులు మొదలైనా అడ్మిషన్లు పూర్తి కాలేదు

MBBS క్లాసులు మొదలైనా అడ్మిషన్లు పూర్తి కాలేదు

సీట్లు వస్తాయో? రావో? తెలియక ఆందోళనలో స్టూడెంట్లు

ఈడబ్ల్యూఎస్​ కోటా  కౌన్సెలింగ్ కూడా పెండింగే

సర్కారు గ్రీన్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదంటున్న హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ

కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా సీట్ల కేటాయింపులో పొరపాట్లు

ప్రభుత్వ అంతర్గత విచారణలో వెల్లడి!

 

రాష్ట్రంలో , బీడీఎస్​ ఫస్ట్ ఇయర్​ క్లాసులు మొదలైనా.. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో సీట్ల భర్తీ మాత్రం పూర్తి కాలేదు. కన్వీనర్ కోటా మూడో విడత, మాప్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదలవలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద 190 సీట్లను మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(ఎంసీఐ) కేటాయించినా వాటినీ భర్తీ చేయలేదు. క్లాసులు మొదలైనా.. సీట్లు భర్తీ చేయకపోవడంతో స్టూడెంట్లు, వారి పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. సర్కారు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రక్రియ ఆగిందని కాళోజీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కన్వీసర్​ కోటా సీట్ల కేటాయింపులో పొరపాట్లు జరిగాయని ప్రభుత్వ అంతర్గత విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్​ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

సర్కార్​ అనుమతి కోసం వెయిటింగ్

కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి రెండు విడతల కౌన్సెలింగ్, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కన్వీనర్ కోటా మూడో విడత, మాప్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మెడికల్​ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా అమలు కోసం రాష్ట్రంలోని 6 ప్రభుత్వ కాలేజీల్లో 190 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది. మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతో కలిపి ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వాహించాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు తాము సిద్ధమని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నామని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

నేషనల్​ కోటా కౌన్సెలింగ్​ పూర్తి

నేషనల్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల నుంచి 15% సీట్లను నేషనల్ కోటాకు కేటాయించగా, స్టూడెంట్లు చేరకపోవడంతో 61 సీట్లు తిరిగి రాష్ట్ర కోటాకి వచ్చాయి. ఈ సీట్లను మూడో విడత కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే భర్తీ చేయాల్సి ఉంది. మూడో విడత కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు ఇచ్చిన గడువు ముగిస్తేగానీ, రెండో విడత మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్ విడుదల చేయడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో మాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికే మరో నెల పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

సీట్ల కేటాయింపులో పొరపాట్లు

కన్వీనర్ కోటా రెండో విడత సీట్ల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని, రిజర్వేషన్ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, బీసీ) అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ స్టూడెంట్ల పేరెంట్స్​ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరణ కోరగా.. ఉల్లంఘనలేవీ జరగలేదని, నిబంధనల ప్రకారమే సీట్లు భర్తీ చేశామని హెల్త్ వర్సిటీ వివరణ ఇచ్చింది. కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా సీట్ల కేటాయింపులో ఉల్లంఘనలు జరిగాయా? లేదా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది. 40 నుంచి 50 మంది మెరిటోరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ క్యాండిడేట్లకు ఓపెన్ కేటగిరీ సీట్లకు బదులు, రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీ సీట్లు కేటాయించినట్టు అంచనాకు వచ్చామని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో 50 మంది రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ అభ్యర్థులు సీట్లు కోల్పోయినట్టేనని, జీవోను తప్పుగా అర్థం చేసుకోవడం, సీట్ల స్లైడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు ఇవ్వాల్సిన సీట్లను ఓసీలకు ఇవ్వడంతో పొరపాట్లు జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు. దీనిపై లోతుగా విచారిస్తున్నామన్నారు. అయితే, తాము ఎటువంటి పొరపాట్లు చేయలేదని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూడో విడత కన్వీనర్ కోటా, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ఆపినట్టు తెలుస్తోంది.