తెలంగాణ లో ఎంబీబీఎస్ మాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్ సీట్ల అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ పూర్తి

తెలంగాణ లో ఎంబీబీఎస్ మాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్ సీట్ల అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ పూర్తి
  • గాంధీలో 1,976.. ఉస్మానియాలో 4,381 ఓపెనింగ్ ర్యాంకులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా మాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-అప్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ మెడికల్ కాలేజీల వారీగా సీట్ల వివరాలను అందులో పొందుపరిచింది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. గాంధీ మెడికల్ కాలేజీలో 1,976వ ర్యాంకు నుంచి సీట్ల కేటాయింపు జరిగింది. 

దివ్యాంగుల కోటాలో 6,18,164వ ర్యాంకు వరకు అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయి. జనరల్ కేటగిరీల్లో 2,51,143వ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 4,381వ ర్యాంకు నుంచి ప్రారంభమై, దివ్యాంగుల కోటాలో 10,20,047వ ర్యాంకు వరకు అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు జరిగాయి. జనరల్ కేటగిరీల్లో 1,65,232వ ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెడికల్ కాలేజీలో 2,663 నుంచి 5,29,521వ ర్యాంకు వరకు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 21,055 నుంచి 10,51,100వ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నీట్ ర్యాంక్ కార్డు, హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీట్లు రద్దవుతాయని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసులు సెప్టెంబర్ 15 నుంచే కాలేజీల్లో చేరాలని సూచించారు.