
- దాతలు సహకరించాలని విజ్ఞప్తి
హన్వాడ, వెలుగు: పేదరికాన్ని జయించి ఓ కూలీ బిడ్డ ఎంబీబీఎస్ సీట్ దక్కించుకుంది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన కామారం నవనీత నీట్ లో ర్యాంక్ సాధించి పాలమూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది. నవనీత తల్లి గంగమ్మ రోజు కూలీ కాగా, తండ్రి రాములు పశువుల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
నవనీత గురుకులంలో టెన్త్, ఇంటర్ చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. గ్రామం నుంచి ఎంబీబీఎస్ కు ఎంపికైన తొలి విద్యార్థి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు దాతలు సహకరించాలని నవనీతతో పాటు ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.