
ముంబై: ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న 22 ఏండ్ల యువతిపై ఆమె క్లాస్‌మెంట్స్ గ్యాంగ్ రేప్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న ఆ యువతి, ఆమె క్లాస్‌మెంట్స్ ఇద్దరు, మరో వ్యక్తి కలిసి సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 10 గంటలకు మూవీకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే, మూవీకి ఇంకా టైమ్ ఉండటంతో నిందితులు ఆమెను తమ రూమ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగాలని బలవంతం చేశారు.
అంతకుముందే ఆమె తాగిన మద్యంలో నిందితులు మత్తుమందు కలపడంతో యువతి కళ్లు తిరిగి పడిపోయింది. అనంతరం ఆ ముగ్గురు యువకులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఆ యువతి కర్నాటకలోని బెళగావిలో ఉంటున్న వాళ్ల పేరెంట్స్‌కు జరిగిన విషయం చెప్పింది. వారు వచ్చి విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పుణె, సోలాపూర్, సాంగ్లీకి చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.