రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' 2025 డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ1,100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ జోరులోనే ‘ధురంధర్ 2’ మూవీని మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో వరుస షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. అయితే, ‘ధురంధర్ 2’ చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది.
ఈ మూవీ యూనిట్‌పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ B62 Studiosపై Brihanmumbai Municipal Corporation (బీఎంసీ) చర్యలు ప్రారంభించింది. అనుమతులు లేకుండా వంటగ్యాస్ వినియోగం, షూటింగ్ ప్రదేశం మార్పు, హైసెక్యూరిటీ జోన్‌లో టార్చ్‌ల వినియోగం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ముంబై పోలీసులు జోక్యం చేసుకుని పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ప్రాథమికంగా రూ.25,000 డిపాజిట్‌ను స్వాధీనం చేసుకున్న బీఎంసీ, అదనంగా రూ.1 లక్ష జరిమానా విధించాలని ప్రతిపాదించింది. స్టూడియోను బ్లాక్‌లిస్ట్ చేయాలన్న సిఫార్సు పరిశీలనలో ఉంది. ఒకవేళ కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో కనుక పెడితే, ఇకపై సదరు నిర్మాణ సంస్థ ముంబై నగరంలో ఎలాంటి షూటింగ్‌లు చేయలేదు. సదరు సంస్థకు అనుమతులు కూడా లభించవు.
అయితే, గత కొన్నిరోజులుగా దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ప్రాంతంలో ‘ధురంధర్ 2’ చిత్ర షూటింగ్ జరుగుతోంది. పురాతన కట్టడాలు, అక్కడికి వచ్చే పర్యాటకులు మరియు స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో నిప్పు వెలిగించడం, టపాసులు పేల్చడం వంటి చర్యలను నిషేధించారు.
అయితే, ఈ నిబంధనలను పాటించకుండా చిత్రబృందం షూటింగ్ సందర్భంగా మంటలు వెలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరణ జరుగుతోందని గుర్తించిన Brihanmumbai Municipal Corporation అధికారులు జరిమానా విధించారు.
అయినా సరే, ఫిబ్రవరి 14 అర్ధరాత్రి మళ్లీ కాగడాలు వెలిగించి చిత్రీకరణ కొనసాగిస్తుండగా బృందం అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించి తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.
ముంబై వంటి మహానగరాల్లో షూటింగ్ పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని Brihanmumbai Municipal Corporation అధికారులు హెచ్చరించారు. ఈ వివాదం కారణంగా ‘ధురంధర్ 2’ షూటింగ్‌కు అంతరాయం ఏర్పడి, సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
Bigaad lo jo bigaad sakte ho, bigaadne ka waqt aa gaya hai. #DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol… pic.twitter.com/qQhhXvp68e
— B62 Studios (@B62Studios) February 16, 2026
