సోలార్ ​పవర్​తో ఎన్నో లాభాలు : ఎండీ జానయ్య

సోలార్ ​పవర్​తో ఎన్నో లాభాలు : ఎండీ జానయ్య

హైదరాబాద్,వెలుగు: సోలార్ కరెంట్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల  ఎన్నో లాభాలున్నాయని  టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్కో ఎండీ జానయ్య అన్నారు. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ ఇండియా, అదానీ సోలార్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించిన పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్ మీట్​లో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి మేలు చేసే సోలార్ కరెంట్​ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు సైతం ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇది వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి నగరాల్లో మాత్రమే సోలార్ కరెంట్​ వాడకం ఎక్కువగా ఉండేదని... ప్రస్తుతం జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సోలార్ కరెంట్​ వాడం పెరిగిందని జానయ్య తెలిపారు. కస్టమర్లు సోలార్​ కరెంట్ ​సిస్టమ్​ను నిర్మించుకుంటే భారీ సబ్సిడీలు పొందవచ్చని వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర మార్కెట్ లోకి  అదానీ సోలార్ ప్యానెల్ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.