
- నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ 2025–-26 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) కన్వీనర్ కోటా కింద సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన ఖాళీ సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్నవారు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి రేపు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు https://tsmds.tsche.in వెబ్‌సైట్‌లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీటు వచ్చి కాలేజీలో చేరిన వారు సెకండ్ ఫేజ్‌లో పాల్గొనవచ్చు.
అయితే..ఫస్ట్ ఫేజ్‌లో సీటు వచ్చినా కాలేజీలో చేరని వారు, వెబ్ ఆప్షన్లు ఎంచుకోని వారు అనర్హులు. పూర్తి వివరాల కోసం జూన్ 26 నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చదవాలని సూచించారు.