
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం, ప్రభుత్వం అవినీతి పై వ్యతిరేకంగా నేపాల్ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే.. వేలాదిగా జడ్ జెన్ యువత వీధుల్లో వచ్చిన నిరసన లు చేపట్టడం, పార్లమెంట్ భవనాన్ని ముట్టడించడంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి.. ఈక్రమంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. అయితే నేపాల్ వ్యాప్తంగా అల్లర్లు చేలరేగుతుండటంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.. నేపాల్ లో ఉంటున్న భారతీయులకు సూచనలు జారీచేసింది.
నేపాల్‌లో జెన్‌జెడ్ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.. అల్లర్ల జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని నేపాల్ ఉన్న భారతీయ పౌరులకు MEA సూచించింది. జాగ్రత్త ఉండాలని నొక్కి చెప్పింది. మరోవైపు నేపాల్ లో త్వరగా శాంతి నెలకొనాలని కోరింది.
నేపాల్‌లో సోమవారం నుంచి జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన భారత విదేశాంగ శాఖ.. చాలా మంది యువకుల ప్రాణాలను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ MEA ఓ ప్రకటన విడుదల చేసింది.
►ALSO READ | భారత ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. అమెరికా తెస్తున్న హైర్ యాక్ట్ 2025 ప్రభావం ఎంత..?
నేపాల్ లో భద్రత పరిస్థితులను అంచనా వేసిన భారత్.. ఖాట్మండుతో సహా నేపాల్ లోని ఇతర నగరాల్లో కర్ఫ్యూలు విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ,నేపాలీ అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
ప్రస్తుతం నేపాల్ లో ప్రధాని రాజీనామా చేసినప్పటికీ, సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా పరిస్థితి ఆందోళనకరంగా నే ఉంది. కర్ఫ్యూలు అమలులో ఉన్న ప్రాంతాలలో భారత పౌరులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని MEA స్పష్టం చేసింది.