
హైదరాబాద్ సిటీ, వెలుగు: డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిన ఇంటిని సందర్శించారు. పరిసరాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ తదితరులు
పాల్గొన్నారు.