
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని పశువులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) తో పాటు ఈ నెల 24న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ ఆదేశాల అమలు కోసం సంబంధిత అధికారులందరు సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.