
హాలియా,వెలుగు: ఎగువ నుంచి నాగార్జునసాగర్ కు భారీ వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. డ్యామ్అధికారులు 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగులు ఎత్తి 5,41,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585.30 అడుగులు( 298.3005 టీఎంసీల) చేరింది.