నల్గొండలో సద్దుల సంబురం.. అతివల కోలాహలం

నల్గొండలో సద్దుల సంబురం.. అతివల కోలాహలం

రామ.. రామ...రామ.. ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం నల్గొండలో వైభవంగా జరుపుకున్నారు.  రంగు రంగు పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

నల్గొండలోని రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి రామాలయంలో, ప్రధాన కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.  బతుకమ్మలను నల్గొండలోని వల్లభ రావు చెరువులో నిమజ్జనం చేశారు. ‌‌ - నల్గొండ వెలుగు, ఫొటో గ్రాఫర్, సూర్యాపేట, యాదాద్రి, వెలుగు