ముగ్గురివి మూడు స్టోరీలు..! కూకట్పల్లిలో ముగ్గురు దొంగలు అరెస్టు

ముగ్గురివి మూడు స్టోరీలు..! కూకట్పల్లిలో ముగ్గురు దొంగలు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కూకట్​పల్లి పోలీసుస్టేషన్‎లో బాలానగర్​ డీసీపీ సురేశ్​కుమార్​ వివరాలు వెల్లడించారు. ఆర్యన్​ యోగేశ్​ధాకన్​(29) కూకట్​పల్లి పరిధి బాలాజీనగర్​లోని బాలాజీ నిలయం అపార్ట్​మెంట్‎లో పేరెంట్స్‎తో కలిసి నివసిస్తున్నాడు. 

తమ అపార్ట్​మెంట్ సమీపంలోనే రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మస్సి సురేశ్​(33) జగద్గిరిగుట్టలో నివసిస్తూ గచ్చిబౌలిలోని ఏటీసీ కంపెనీలో నెట్​వర్క్​ఇంజినీర్‎గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కార్ల చోరీకి పాల్పడుతున్నాడు. అల్లూరి పవన్(27) మూసాపేట పరిధిలోని కైత్లాపూర్‎లో నివసిస్తున్నాడు. కూకట్​పల్లిలో ఫొటోగ్రాఫర్‎గా పని చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ఫొటోస్డూడియోలోనే సుమారు రూ.2.50 లక్షల కెమెరాను దొంగిలించాడు. ఈ ముగ్గురిని సోమవారం అరెస్ట్​ చేశారు.