రిలయన్స్ మంచి నీళ్ల వ్యాపారం : 5 రూపాయలకే వాటర్ బాటిల్...

 రిలయన్స్ మంచి నీళ్ల వ్యాపారం : 5 రూపాయలకే వాటర్ బాటిల్...

రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) "SURE" మినరల్ వాటర్‌ లాంచ్ చేస్తూ, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. SURE 250ml చిన్న బాటిల్ ధర రూ.5 నుండి ప్రారంభమై బిస్లెరి, అక్వాఫినా, కిన్లీ వాటర్ ధరతో పోలిస్తే 20-30% తక్కువ ధరకే అందిస్తుంది.

SURE వాటర్ బాటిల్ ధరలు:
"SURE" నీటిని రివర్స్ ఆస్మాసిస్ & UV ట్రీట్మెంట్ తో సహా అధునాతన ప్రాసెస్ ద్వారా శుద్ధి చేస్తారు. అలాగే రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ఖనిజాలను చేర్చింది. పర్యావరణ అనుకూలమైన PET బాటిళ్లలో ప్యాక్ చేసిన ఈ వాటర్ ఇల్లు, ఆఫీస్, ప్రయాణ సమయంలో అలాగే ప్రతిరోజు ఉండే నీటి అవసరాలకు కోసం తీసుకొస్తున్నారు.  

వాటర్ బాటిల్ వేరియంట్లు & ధర:
*250ml చిన్న బాటిల్ : రూ.5 (ఎంట్రీ-లెవల్).
*500ml మీడియం సైజ్ బాటిల్ : రూ.10.(ప్రయాణాల కోసం)
*1లీటర్ బాటిల్ : రూ.20 (ఆఫీస్ వినియోగం కోసం).
*20లీటర్ల క్యాన్ : రూ.80 (ఇల్లు/బల్క్ రీఫిల్ ఆప్షన్ కోసం).
రిలయన్స్ రిటైల్ అవుట్‌లెట్‌లో (జియోమార్ట్, రిలయన్స్ స్మార్ట్) ఈ SURE వాటర్ మొదట లభిస్తాయి. 

ఇతర వాటర్ బాటిల్ ధరలతో పోల్చి చూస్తే :
*SURE వాటర్ చిన్న బాటిల్ 250ml ధర రూ.5... బిస్లరీ చిన్న బాటిల్ ధర రూ.7 అంటే 20-30% తక్కువ.  
*మీడియం బాటిల్ 500ml ధర రూ.10, అంటే కిన్లీ ధర రూ.13    కంటే 20-30% తక్కువ. 
*అలాగే పెద్ద బాటిల్ 1లీటర్ ధర రూ.20, అక్వాఫినా రూ.25 ధరతో పోల్చితే 20-30% తక్కువ. 
*ఇక రీఫిల్ చేసే సౌకర్యంతో 20లీటర్ల క్యాన్ ధర రూ.80 అంటే ఇతర బ్రాండెడ్ వాటర్ తో పోల్చితే బల్క్ సేవింగ్స్ అందిస్తుంది. 

ALSO READ : వాటర్ వ్యాపారంలోనూ వార్ మెుదలు పెట్టిన ముఖేష్ అంబానీ.. ఏం చేస్తున్నాడంటే..?

ఈ లాంచ్ 22 ఫిబ్రవరి 2025న గౌహతిలో RCPL కొత్త బాట్లింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంతో సమానంగా జరుగుతుంది, దీనిని స్థానిక భాగస్వామి జెరిఖో ఫుడ్స్ అండ్ బెవరేజెస్ LLPతో కలిసి అభివృద్ధి చేశారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌లో రెండు హై-స్పీడ్ లైన్లు ఉన్నాయి. ఒకటి 583 BPM నీటి ఉత్పత్తి యూనిట్ (సామర్థ్యం: సంవత్సరానికి 18 కోట్ల లీటర్లు), కాంపా వేరియంట్‌ల కోసం 600 BPM కార్బోనేటేడ్ సాఫ్ట్ డ్రింక్ లైన్ ఉంది. ఈ ప్లాంట్ కాంపా కోలా, కాంపా ఆరెంజ్, కాంపా లెమన్, పవర్ అప్ ఎనర్జీ డ్రింక్స్ తో పాటు "SURE ” వాటరును ఉత్పత్తి చేస్తుంది. రూ.30వేల కోట్ల విలువైన భారతదేశ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లో బిస్లరీ (25% వాటా) ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే SURE వాటర్ FY26 నాటికి 5-10% మార్కెట్ వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.