ఇక Movierulzకు మూడింది.. ఈ పైరసీ వెబ్సైట్కు.. డబ్బులు ఎలా వస్తున్నాయో తేల్చిన పోలీసులు

ఇక Movierulzకు మూడింది.. ఈ పైరసీ వెబ్సైట్కు.. డబ్బులు ఎలా వస్తున్నాయో తేల్చిన పోలీసులు

హైదరాబాద్: తెలుగు సినీ ప్రముఖులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు పాల్గొన్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, రామ్ కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో రెండు రకాలు పైరసీలు గుర్తించారు. ఒకటి.. థియేటర్లలో మొబైల్ ఫోన్‌లతో సినిమా రికార్డు చేయడం, రిలీజ్‌కు ముందే డిజిటల్ సిస్టమ్‌లను హ్యాక్ చేసి ఒరిజినల్ కంటెంట్‌ను దొంగిలించడం. దర్యాప్తులో TamilMV, Tail Blasters, Movierulz వంటి పైరసీ పోర్టల్స్ ఈ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వెబ్‌సైట్లకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ స్పాన్సర్ల ద్వారా ఆదాయం వస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ పోలీసులు భారీ సినిమా పైరసీ రాకెట్ ఛేదించిన సంగతి తెలిసిందే. 

సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్లో విక్రయిస్తున్న దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన వారి నుంచి కం ప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంటర్నె ట్ కనెక్టివిటీ టూల్స్ తోపాటు సాంకేతిక పరికరాల ను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు జరుపుతూ కోట్లల్లో ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులు గుర్తించారు.

హ్యాష్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను ఇచ్చిన వివరాలతో దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్లో పైరసీ ముఠా ఉన్నట్లు గుర్తించారు. వీరు థియేటర్లో ప్రదర్శితమయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్పర్డులను క్రాక్ చేస్తున్నట్లు తేలింది. దాంతో పాటు ఏజెంట్ల అంగి జేబుల్లో, సిగరెట్ ప్యాకెట్లు, పాప్ కార్న్ ప్యాక్స్పై హై ఎండ్ కెమెరాలు పెట్టి థియేటర్లో స్పెషల్ యాప్ ద్వారా సినిమాలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్లు అందిస్తున్నారు.

ప్రధాన నిందితుడు జానా కిరణ్ కుమార్ మంత్రా మాల్ థియేటర్లో సినిమాలను రికార్డ్ చేస్తున్నాడు. ఇతను ఇప్పటివరకు 40 సినిమాలు పైరటెడ్ చేనట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో రెండో నిందితుడు సిరిల్ రాజ్ అమలా దాస్ వెబ్ సైట్స్ ద్వారా పైరేటెడ్ గేమింగ్ సైట్స్ ద్వారా క్రిప్టో కరె న్సీలో డబ్బులు కన్వేర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఓజీ, హిట్, కుబేరా, హరి హర వీరమల్లు, రాధే శ్యామ్, దసరా, లక్కీ భాస్కర్, డాకూ మహారాజ్ సినిమాలను నిందితులు పైరసీ చేశారు. నిందితుడు అశ్వనీ కుమార్ క్యూబ్ సినిమాస్ వంటి మూవీ ప్రొవైడర్స్ సంస్థల సర్వర్స్ హ్యాక్ చేసి కొత్త సినిమాలను వారి వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తున్నాడు. దాంతో పాటు ప్రభుత్వ వెబ్ సైట్ లను సైతం హ్యాక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.