
మెదక్ టౌన్, వెలుగు: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. శనివారం చేగుంట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుకున్నారు. దవాఖానాలో ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేసి నిత్యం ఎంత మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారని ఆరా తీశారు. మందులు అన్నీ అందుబాటులో ఉంచాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. గత నెలలో జరిగిన డెలివరీల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచాలని సూచించారు.
చిన్నశంకరంపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే గల హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా ఆరా తీశారు.