
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాను విద్య, వైద్య, పౌరసరఫరాల విషయాల్లో అధికారులు మరింత బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి జిల్లాను అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో విద్య, వైద్యం, పౌరసరఫరాల శాఖల ప్రగతిపై జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... విద్యాశాఖ ద్వారా చేపట్టిన బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, డ్రాపవుట్స్, ఎన్రోల్మెంట్పై దృష్టిసారించాలన్నారు.
పలు విషయాలపై సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో వేడి ఆహార పదార్థాలు వడ్డించాలన్నారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్, ఎస్సీ డెవలప్మెంట్ఆఫీసర్విజయలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శ్రీరామ్, డీటీడబ్ల్యువో నీలిమ, డీడబ్ల్యువో హైమావతి, మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్
టేక్మాల్, వెలుగు: టేక్మాల్ మండలం కేంద్రంలోని షెడ్యూల్ కులాల, బీసీ బాలుర వసతి గృహాలను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఆయా హాస్టల్ లలో వంటగది, మరుగుదొడ్లను, విద్యార్థులు నిద్రించే రూమ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా విద్యార్థుల మెనూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో ఆన్‌లైన్ మాడ్యూల్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తులసీరాం ఉన్నారు.