అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్​ మండల కేంద్రంలో నిర్మిస్తున్న అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్​ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణంలో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బిల్డింగ్​పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలన్నారు. 

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్​లో సాంకేతిక విద్య అందించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ జోనల్​ మేనేజర్​ అనురాధ, డీఈ రాందాస్, ఎలక్ట్రికల్ డీఈ వాణీలత పాల్గొన్నారు.