- మెదక్ డీసీఎస్వో నిత్యానందం
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి ఎలాంటి కొరతలేదని ఈ విషయంలో వదంతులను ఏమాత్రం నమ్మొద్దని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్వో) నిత్యానందం చెప్పారు. ఈ మేరకు శనివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులు, రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిత్యానందం మాట్లాడుతూ...జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు 83 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9391942254 ను సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
