విలేజ్ బర్త్ డే.. కేక్ కట్ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

విలేజ్ బర్త్ డే.. కేక్ కట్ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

 

  •     ఊరికి పుట్టినరోజు సెలబ్రేషన్స్​
  •     మెదక్ ​జిల్లా లక్ష్మీనగర్ లో  ఆటపాటలతో సంబురాలు

  
పాపన్నపేట, వెలుగు : ‘మామూలుగా మనుషులకు పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేస్తరు..కొంతమంది తాము పెంచుకునే కుక్కులు, పిల్లులకు కూడా బర్త్ డే వేడుకలు చేస్తున్నరు, కానీ, ఊరికి చేసుడేంది. ’ అని సప్రైజ్ అయితున్నరా? అవును మీరు చదువుతున్నది నిజమే... మెదక్​జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్​అనే ఊరికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు గ్రామస్తులంతా కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నరు. ఈ సంక్రాంతికి లక్ష్మీనగర్ పుట్టి 74 ఏండ్లయిన సందర్భంగా ధూంధాంగా సంబురాలు చేసిండ్రు. 1200 వందల జనాభా ఉన్న ఈ ఊరు1995లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మన ఊరిని మనమే డెవలప్​చేసుకోవాలె అనే నినాదంతో పెండ్యాల ప్రసాద్​అనేటాయన 2014ల లక్ష్మీనగర్ వెల్పేర్​ సొసైటీ ఏర్పాటు చేసిండు. ప్రతి యేడు ఊరికి పుట్టిన రోజు చేద్దాం అనే  కాన్సెప్ట్​తో ఊళ్లో వాళ్లందరిని ఏకం జేసి ఏడేండ్లుగా సక్సెస్​పుల్​గా కొనసాగిస్తుండు. 

ముగ్గులు, ఆటల పోటీలు...

విలేజ్ బర్త్​డే సందర్భంగా సంక్రాంతి రోజు గ్రామంలో ముగ్గులు, కబడ్డీ, ఖోకో, స్లో సైకిల్ వంటి పోటీలు నిర్వహించిన్రు. గెలిచినోళ్లకు ప్రైజులు కూడా ఇచ్చిన్రు. రాత్రి సర్పంచ్​అనురాధ, ఎంపీటీసీ నాగదుర్గ, మరికొంతమంది కలిసి కేక్ కట్ చేసిన్రు. అంతకు ముందు గత ఏడాది ఊరిలో సచ్చిపోయినోళ్లను గుర్తు చేసుకున్నరు. పెండ్యాల ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు పిన్న ప్రసాద్, టీఆర్​ఎస్​ లీడర్​ ఏడుకొండలు పాల్గొన్నరు.