మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశాం

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో 25 వేల బస్తాల  యూరియా పంపిణీ చేశాం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని రైతులకు ఇప్పటి వరకు 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశామని శివ్వంపేట సహకార సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అగ్రికల్చర్ ఏవో లావణ్య తెలిపారు. ఆదివారం వారు సొసైటీలో  మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మండలంలో రైతులు వేసిన పంటలకు సరిపడా యూరియా పంపిణీ చేశామన్నారు. 

చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడానికి రైతులకు ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ చేశామన్నారు. ఇంకా రైతులకు యూరియా అవసరం ఉంటే పంపిణీ చేస్తామని చెప్పారు.  సొసైటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ మధు,  రైతు సంఘం అధ్యక్షుడు మైసయ్య, డైరెక్టర్లు ఉన్నారు.