మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్ తనిఖీ

మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్ తనిఖీ
  • సౌకర్యాలు, సేవలపై  కమిటీ ఆరా 

మెదక్, వెలుగు: అసెస్మెంట్ కమిటీ ఇన్‌‌చార్జి డాక్టర్ విమల థామస్ బృందం మంగళవారం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజిని తనిఖీ చేసింది.  కలెక్టర్‌‌‌‌తో కలసి పాత కలెక్టరేట్ బిల్డింగ్‌‌లో కొనసాగుతున్న మెడికల్ కాలేజితో  పాటు, దానికి అనుబంధంగా కొనసాగుతున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీ జీ హెచ్), మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎం సీ హెచ్)ను విమల థామస్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. కాలేజీ లో ఆయా విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది పోస్టులు, ఖాళీల స్థితి, డిజిటల్ క్లాస్ రూమ్ లు, లైబ్రరీ, ల్యాబ్ లు, హాస్టల్ రూమ్ లలో వసతులు, మెస్, పరిశీలించారు.

జనరల్ హాస్పిటల్‌‌కార్డులు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, సీటీ స్కాన్, సీఆర్మ్ యంత్రాల పనితీరు, ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. తనిఖీ నివేదికను చీఫ్ సెక్రటరీకి సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. డాక్టర్ విమల థామస్ మాట్లాడుతూ..  హాస్పిటల్, కాలేజ్ పరిపాలనల మధ్య సమన్వయం చేసి, ఆరోగ్య సేవలు అందించేందుకు  పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‌‌మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్,  హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీతాదేవి, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జయ పాల్గొన్నారు.