మెదక్ జిల్లాలో.. రెండు దశల్లో ఎన్నికలు

మెదక్ జిల్లాలో.. రెండు దశల్లో ఎన్నికలు
  •  జిల్లాలో 21 జడ్పీటీసీ , 
  • 190 ఎంపీటీసీ స్థానాలు
  • 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు

మెదక్​, వెలుగు: మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. జిల్లాలో 21 మండలాల పరిధిలో 21 జడ్పీటీసీ స్థానాలు, 190 ఎంపీటీసీ స్థానాలు, 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకటి, రెండో దశలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు, మూడో దశలో జరుగనున్నాయి. 

పరిషత్​ స్థానాలకు.. 

మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్​ పరిధిలోని 10 జడ్పీటీసీ స్థానాలకు, 99 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్​ 23న పోలింగ్​ జరుగుతాయి. రెండో విడతలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్​ పరిధిలోని 5 మండలాలు, తూప్రాన్​ రెవెన్యూ డివిజన్​ పరిధిలోని 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 11 జడ్పీటీసీ స్థానాలకు, 91 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్​ 27న పోలింగ్ జరుగుతుంది. రెండు విడతల్లో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్​ 11న జరుగుతుంది. పరిషత్​ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 503 లొకేషన్లలో 1,052 పోలింగ్​ స్టేషన్​ లను ఏర్పాటు చేశారు. 

పంచాయతీలకు...

పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు దశల్లో నిర్వహిస్తోంది. కాగా మెదక్ జిల్లాలో మాత్రం పంచాయతీ ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరగనున్నాయి. మెదక్ రెవెన్యూ డివిజన్​ పరిధి1‌‌0మండలాల్లోని 244 గ్రామ పంచాయతీలు, 2,124 వార్డు స్థానాలకు రెండో దశలో నవంబర్​ 4న పోలింగ్​ నిర్వహిసత్ఆరు. మూడో దశలో నర్సాపూర్​, తూప్రాన్ రెవెన్యూ డివిజన్​ పరిధి 11 మండలాల్లోని 284 గ్రామ పంచాయతీలు, 2,096 వార్డు స్థానాలకు నవంబర్​ 8న పోలింగ్​ జరుగుతుంది. గ్రామ పంచాయతీల్లో పోలింగ్​ జరిగిన రోజే మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల కోసం వార్డుకు ఒకటి చొప్పున జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,220 పోలింగ్​ స్టేషన్​ లను ఏర్పాటు చేశారు.