మెదక్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు.. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు

మెదక్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు.. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు

మెదక్, వెలుగు: స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేశారు. శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ మహిళా  రిజర్వేషన్  కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. 

జిల్లాలో 21 మండలాలు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 21  జడ్పీటీసీ స్థానాలకు ఎస్టీలకు 2 రిజర్వ్ కాగా అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయింది. ఎస్సీలకు 4 జడ్పీటీసీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించారు. 

బీసీలకు 9 స్థానాలు రిజర్వ్ కాగా ఎంపీపీ4 స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగతా 6  మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా వీటిలో 3  స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని 21 ఎంపీపీ స్థానాలకు ఎస్టీలకు 2 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయింది. ఎస్పీలకు 4 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించారు. బీసీలకు 9 స్థానాలు రిజర్వ్ కాగా వాటిలో 4  మహిళలకు కేటాయించారు. మిగతా 6 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించారు.