
రామాయంపేట, వెలుగు: పేదలకు ఆర్థికంగా మేలు చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం రామాయంపేటలోని ఎస్సీ కాలనీలో పీఎం నరేంద్రమోదీ 75వ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవాపక్షంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో వివిధ షాపులు తిరుగుతూ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షంలో భాగంగా పేదల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తోందని, వారికి చిత్తశుద్ధి ఉంటే 42 కాదు 46 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాములు, పట్టణ ప్రెసిడెంట్ అవినాశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, వెల్ముల సిద్ధరాములు ఉన్నారు