జర్నలిస్ట్ల సంక్షేమానికి కృషి : మున్సి పల్ వైస్ చైర్ పర్సన్ నరేశ్ గౌడ్

జర్నలిస్ట్ల సంక్షేమానికి కృషి : మున్సి పల్ వైస్ చైర్ పర్సన్ నరేశ్ గౌడ్
  • మున్సిపల్​ వైస్ చైర్​పర్సన్​ నరేశ్​ గౌడ్

మెదక్, వెలుగు: మెదక్ మున్సిపల్ వైస్ చైర్​ పర్సన్​ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేశ్ గౌడ్ ను గురువారం జర్నలిస్ట్​లు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఎల్లవేళలా తాను జర్నలిస్ట్​లకు అండగా ఉంటానని, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి జర్నలిస్ట్​ల సహకారం అవసరమన్నారు. ఎమ్మెల్యే రోహిత్​రావు​ సహకారంతో పిల్లికొటాల్​లోని జర్నలిస్ట్​ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, తదితర మౌలిక వసతుల కల్పనకు, అర్హులైన జర్నలిస్ట్​లకు ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జర్నలిస్టులు కిషన్, సురేందర్​ రెడ్డి,  ప్రకాశ్, రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్, రాజశేఖర్, మురళి, రియాజ్, రహమత్, యూసుఫ్​ పాల్గొన్నారు.