మెదక్‌‌‌‌ జిల్లాలో జూలై 31 వరకు పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్‌‌‌‌ జిల్లాలో జూలై 31 వరకు పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా  జులై నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్​యాక్టు అమలులో ఉంటుందని మెదక్​ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ..  నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. 

సైబర్ నేరాలతో జరభద్రం 

కౌడిపల్లి, వెలుగు:  సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ  డీవీ శ్రీనివాస్ రావ్ తెలిపారు. గురువారం కౌడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  అత్యాశతో చాలామంది సైబర్ నేరాలలో మోసపోతున్నారని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.