
మెదక్ టౌన్, వెలుగు: గత 19 నెలల్లో ఆర్టీఐకి వచ్చిన 125 దరఖాస్తుల్లో అన్నింటినీ పరిష్కరించి, బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో మెదక్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. కరీంనగర్‌కు మొదటి స్థానం దక్కింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతులమీదుగా కలెక్టర్ రాహుల్రాజ్అవార్డు అందుకున్నారు. జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. =