కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు..ఐదో రోజు రూ.1.12 కోట్ల ఆదాయం

కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు..ఐదో రోజు రూ.1.12 కోట్ల ఆదాయం

వరంగల్‍, వెలుగు : మేడారం మహాజాతర నేపథ్యంలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన కానుకల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఐదురోజు కొనసాగింది. సోమవారం 163 హుండీలను తెరువగా రూ. 1.12 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.  

ఇప్పటివరకు మొత్తం 788 హుండీలను ఓపెన్‌‌‌‌ చేయగా.. రూ.11,83,85,116 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. జాతరలో మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర పూర్తయ్యాక తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన 40 హుండీలు సైతం లెక్కించాల్సి ఉంది.