ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం

ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం

ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి చోరీలకు పాల్పడుతూ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకే రోజు ఏకంగా రెండు వైన్ షాపుల్లో చోరీ చేశారు. ఆధునాతర పరికరాలతో డోర్స్ కట్ యధేచ్చగా తమ పనికానించేసి దర్జాగా పారిపోతున్నారు. ఆదివారం (మే24) అర్థరాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని రెండు వైన్ షాపుల్లో దొంగలు చోరీకి  తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే. 

ములుగు పట్టణ కేంద్రంలోని 163 నేషనల్ హైవే పై ఉన్న రెడ్డి వైన్స్, పెద్దమ్మ వైన్స్ షాపుల్లో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. అధునాతన కట్టర్తో డోర్ ను కట్ చేసి లోపలికి దర్జాగా దోచుకొని వెళ్లారు. మరుసటి రోజు సోమవారం  షాపుకు వచ్చిన సిబ్బంది చోరీకి గురైనట్టు గుర్తించారు. కౌంటర్లలో ఉంచిన రూ. 60 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ములుగు ఎస్ ఐ ఉపేందర్ రావు. సీసీఫుటేజీ ఆధారంగా దొంగలకోసం గాలిస్తున్నారు.  ఒకే రోజు రెండు వైన్ షాపుల్లో చోరీ జరగడంతో స్థానికులు.  భయాందోళన గురవుతున్నారు. 

ALSO READ : రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్