భక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం

భక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం

మినీ మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బంగారం(బెల్లం) సమర్పించి, సమ్మక్క–సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, పీవో అంకిత్​, ఎస్పీ గౌస్ ఆలం, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ అమ్మవార్లను దర్శించుకున్నారు. కొండాయిలోని గోవిందరాజులు గుడిలో మంత్రి  పూజలు చేసి, నాగులమ్మ జాతరలో పాల్గొన్నారు. మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది.