మేడారంలో ఇండ్ల రెంట్లు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు ఉండేందుకు ఇండ్లు వెతుకుతుండడంతో స్థానికులు భారీ మొత్తంలో రేట్లు వసూలు చేస్తున్నారు. ఒక్క ఫ్యాన్ తప్ప మరే ఇతర సౌలత్‌లు లేని గదులకు సైతం రోజుకు రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు.
గదులు తీసుకోలేని వారు చెట్ల నీడలోనైనా సేదతీరుదామంటే వాటికి కూడా కిరాయిలు వసూలు చేస్తున్నారు. జాతరకు దగ్గర్లో భూమి ఉండి అందులో మామిడి వంటి తోటలు వేసిన స్థానికులు చుట్టూరా కంచె వేసి చెట్లను కిరాయికి ఇస్తున్నారు. కుటుంబసభ్యులు కలిసి భోజనం చేయడానికి ఒక్కో చెట్టుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు.
