మేడారం జాతరలో ఎస్సైని చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ

మేడారం జాతరలో ఎస్సైని చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ
  • కుటుంబసభ్యుల ముందే కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ 
  • మేడారం జాతరలో ఘటన  

వరంగల్ (మేడారం), వెలుగు: మేడారం జాతరలో తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క దర్శనానికి వెళ్తున్న ఏఆర్ ఎస్సై రవికుమార్ ను అతని ఫ్యామిలీ మెంబర్స్​ ముందే ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ చెంప దెబ్బ కొట్టారు. శుక్ర వారం రాత్రి ఈ ఘటన జరిగింది. వరం గల్ కమిషనరేట్ కు చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతరలో రోప్ పార్టీ ఇన్​చార్జ్​గా డ్యూటీలో ఉన్నారు. శుక్ర వారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లారు. క్యూ లైన్​లోకి తన భార్య, పిల్లలను పం పించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఆలం గౌష్ రవికుమార్ చెంప మీద కొట్టా రు. ఈ హఠాత్పరిణామంతో ఎస్సై బిత్తర పోగా, ఎస్పీ బూతుపురాణం అందుకు న్నారు. ఇది చూసిన ఎస్సై కుటుంబ సభ్యు లు కన్నీటి పర్యంతమ య్యారు. పనిష్మెం ట్ కింద కుటుంబ సభ్యుల ముందే రవి కుమార్​ను కింద కూర్చోబెట్టారు. కొందరు సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయ గా, ఉన్నతాధికారులు శాంతింపజేశారు.