ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర

ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర

ములుగు జిల్లాలో మేడారం మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం చిన జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జాతర ఘనంగా జరుగుతోంది. మేడారం మినీ జాతర నాలుగు రోజుల పాటు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. జాతర సందర్భంగా భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. జాతర సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం చిన్న జాతరకు 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.