
ములుగు జిల్లా: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(40) అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సాంబయ్య కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట సీరియస్ కావడంతో ఆయనను ఏటూరునాగారంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడు సాంబయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.