
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన, సారలమ్మ పూజారి కాక సంపత్ (30) శుక్రవారం ఉదయం చనిపోయాడు. సంపత్‌కు పది రోజుల కింద కామెర్లు సోకడంతో కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా కామెర్లు తగ్గకపోవడంతో శుక్రవారం మరోసారి హాస్పిటల్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటి వద్దే చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.